RajyaSabha: ఛైర్మన్-ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం.. సభ్యులు నవ్వులే నవ్వులు
- రాజ్యసభ ఛైర్మన్.. ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం
- సభలో సభ్యులు నవ్వులే నవ్వులు
- నవ్వులు చిందించిన సోనియాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం పార్లమెంట్ ఉభయ సభలు హాట్ హాట్‌గా సాగాయి. ఇక రాజ్యసభలో అయితే ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్-కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. తీవ్ర ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి. కానీ తాజా పరిణామాలు అందుకు భిన్నంగా మారిపోయింది. సోమవారం సభలో ధన్‌ఖడ్, ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దీంతో సభలో సభ్యులు నవ్వులు చిందించారు.
ఇది కూడా చదవండి: Thangalaan: మరో ఇండియన్ మూవీ చరిత్ర సృష్టించనుంది.. త్వరలోనే ట్రైలర్: జీవీ ప్రకాశ్‌కుమార్
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని కోరారు. ధన్‌ఖడ్ బదులిస్తూ.. సభలో ప్రసంగించేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోమని తెలిపారు. ఇబ్బందిగా ఉంటే కూర్చొని మాట్లాడవచ్చని బదులిచ్చారు. దీనికి ఖర్గే ప్రతి స్పందనగా.. కూర్చొని చేసే ప్రసంగం.. నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. దీంతో విపక్ష నేత మాటలతో ఛైర్మన్ కూడా ఏకీభవించడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఈ విషయంలో తాను సాయం చేస్తానని ధన్‌ఖడ్ అన్నారు. ఛైర్మన్ కూడా కొన్ని సందర్భాల్లో తమకు సాయం చేశారని.. దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని ఖర్గే అనడంతో సభ మొత్తం నవ్వులు విరబూశాయి. ధన్‌ఖడ్-ఖర్గేల మధ్య కొనసాగిన సంభాషణలతో సోనియాగాంధీ కూడా నవ్వులు చిందించారు.
ఇది కూడా చదవండి: #BSS11: న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్..!
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!