Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్),…
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన అత్యంత అర్హులైన ప్రముఖులైన కె.వి.విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి…
ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ కు ఎంపీ సంతోష్ కుమార్ ట్వీటర్ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయినందున మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మన స్వంత కథా రచయిత విజయేంద్రప్రసాద్ అంటూ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లైక్స్‌తో ఫ్లోర్‌ను పంచుకోవడం నాకు గౌరవంగా ఉంటుంటూ.. ట్విటర్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ అభినందనల వర్షం కురిపించారు. ఎంపీ సంతోష్ కుమార్ తో ప్రముఖ సినీ…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…
మహారాష్ట్రలో అధికార పక్షానికి భారీ ఎదురుదెబ్బ తీగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని మరింతగా పెంచుకుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని రాజ్యసభ సభ్యుల ఎన్నిక అందర్ని ఆకర్షించింది. మహారాష్ట్రలో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇటీవల మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిని ఖాళీతో పాటు డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్మీకాంతరావు పదవీ కాలం ముగియడంతో రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాయత్రి రవి, హెటిరో అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు…
నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్‌నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ…
వైసీపీ తరఫున తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆర్.కృష్ణయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయటానికి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు సిగ్గుండాలని.. సీఎంగా పనిచేసిన ఆయన తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల కోసం మొదటి నుంచి పోరాటం చేస్తోంది తానేనని…
కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 10 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించగా.. కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడాఉన్నారు. 2003-2004లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తామని సోనియా హామీ ఇచ్చారని.. అయితే 18 ఏళ్లు దాటినా తనకు అవకాశం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి…