AP 3 Capitals: మూడు రాజధానులపై నిర్ణయం.. ఎక్కడ ఉండాలో మా ఇష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP 3 Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం.. అసలు రాజధానులు ఎక్కడ పెట్టాలనేది రాష్ట్రాల ఇష్టం అని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు రాజధానులని స్పష్టం చేసిన ఆయన.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది మా ధ్యేయం అన్నారు.. రాజధాని నిర్ణయించే అధికారం లేదని చెప్పిన హైకోర్టు.. ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని విమర్శించారు. రాజధాని నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
Read Also: AP Special Status: ఏపీకి అన్యాయం చేశారు.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన వైసీపీ
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఇక, కేంద్ర ప్రభుత్వం, న్యాయ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే అధికారం లేదన్నారు సాయిరెడ్డి.. రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించి అంశం.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించుకుంది.. రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో మేం నిర్ణయించుకుంటాం అన్నారు.. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాజధాని ఓ చోట.. హైకోర్టు మరోచోట ఉందనే విషయాన్ని ప్రస్తావించిన విజయసాయి రెడ్డి.. ఉత్తరప్రదేశ్ లో లక్నోలో సెక్రటేరియట్ ఉంటే అలహాబాద్ హైకోర్టు ఉందని.. దీని ప్రకారం అక్కడ ఇప్పటికే రెండు రాజధానులు అమల్లో ఉన్నాయన్నారు.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ విషయంలో వివక్ష చూపిస్తున్నారు.. ఏపీపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.. వైజాగ్ మెట్రోకు కేంద్రం నిధులివ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..