దేశంలోని ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఆదివారం నాడు తన తొలి జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారు. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య కర్ణాటక…
బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేయాలని చూస్తోంది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొనే పనిలో పడింది. వివిధ సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది ఢిల్లీ నాయకత్వం. పార్టీ పదవుల్లో ఇప్పటికే పెద్దపీట వేసింది. మోడీ సర్కార్‌లో కిషన్‌రెడ్డికి కేబినెట్ పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయను గవర్నర్‌ను చేసింది. ఇదే కోవలో మరికొన్ని పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్న ప్రచారం కాషాయ శిబిరంలో…
అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతాడని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. అసలు రాయలసీమకు ఆయన ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట……
గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఇటీవల సీఎం జగన్ రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బీద మస్తాన్‌రావు రాజ్యసభ సీటును డబ్బులిచ్చి కొనుక్కున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీద మస్తాన్‌రావు స్పందించారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులకే రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నారని బీద మస్తాన్‌రావు…
తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావులను వైసీపీ ఎంపిక చేసింది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయసాయి రెడ్డి…
రబీ ధాన్యం కొనుగోళ్లులో పెద్ద కుంభకోణం జరుగుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ బహిరంగ విమర్శలు చేశారు. ఇందుకు జిల్లా డీఆర్సీ, నీటి సలహా కమిటీ వేదికైంది. రైతుల అమాయకత్వాన్ని రైస్ మిల్లర్లు దోచేస్తున్నారనేది బోస్ ఆరోపణ. అయితే ఎంపీ చేసిన కామెంట్స్‌పై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. తండ్రి భాస్కర్‌రెడ్డి…
TRS రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఉద్యమ కారులకు స్థానం లేదనేది స్పష్టమవుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ మండి పడ్డారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం సిగ్గు చేటని నిప్పులు చెరిగారు. ఇంటికొ బీర్, వీధికొ బారు ఇదే కెసిఆర్ దర్బార్ అంటూ ఎద్దేవ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వాళ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. చెల్లి కోసమే జగన్ తెలంగాణ వారికి రాజ్యసభ సీట్లు కేటాయించారని తెలిపారు.…
గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా… సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్అయ్యారు. వీళ్ళకి సీట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ రుణాలు, టాక్స్ లు ఎగ్గొటిన్న మైనింగ్ డాన్ రవిచంద్రకి సీటా.? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారి చివరకు మీ పార్టీలోకి…
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లను మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు వస్తుందని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడారంటూ వార్తలు వినిపించాయి. అలీ కూడా కొన్నిసార్లు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా…
ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. Andhra…