PT Usha: రాజ్యసభలో గురువారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఛైర్మన్ జగదీష్ థన్‌కర్ సభలో లేని సమయంలో పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. తనకు దక్కిన అరుదైన అవకాశం గురించి ట్విటర్ లో పీటీ ఉష పంచుకున్నారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష, తన ట్విట్టర్ లో ఈ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు. సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందన్నారు. ‘అత్యున్నత అధికారం గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంద’ని ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ చెప్పిన మాటలు.. నేను రాజ్యసభ సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి. నా ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో నేను ఈ ప్రయాణంలో మైలురాళ్లను అందుకుంటానని ఆశిస్తున్నాన’ని పీటీ ఉష ట్వీట్ చేశారు.
Read Also: Chiken Auction : వామ్మో.. ఈ కోడి ధర రూ.34వేలు
ఆమె ట్వీట్ చూసిన అభిమానులు ‘మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. ముందుకు సాగుతూ మరోసారి చరిత్ర సృష్టించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమైన సాధికారత!! ఆల్ ది బెస్ట్ మరియు కచ్చితంగా మీరు దేశానికి చాలా ఎక్కువ తిరిగి ఇస్తారు మేడమ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
Read Also:Google Maps: సూపర్ ఫీచర్స్‌తో గూగుల్ మ్యాప్స్..ఉన్నచోటు నుంచే!
2022లో బీజేపీ తరఫున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాజ్యసభ వైస్ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో గత డిసెంబరులో పీటీ ఉషకు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన మొదటి నామినేటెడ్ ఎంపీగా ఆమె నిలిచారు. మహిళా స్ప్రింటర్‌గా ఉష ఇండియా తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఏషియన్ గేమ్స్, ఏషియన్ చాంపియన్ షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్లలో పాల్గొన్నారు తన కెరీర్‌లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను నెలకొల్పారు.