గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా… సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్అయ్యారు. వీళ్ళకి సీట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ రుణాలు, టాక్స్ లు ఎగ్గొటిన్న మైనింగ్ డాన్ రవిచంద్రకి సీటా.? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారి చివరకు మీ పార్టీలోకి…
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు రాజ్యసభ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్యల పేర్లను మంగళవారం నాడు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు వస్తుందని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడారంటూ వార్తలు వినిపించాయి. అలీ కూడా కొన్నిసార్లు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా…
ఏపీలో తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని.. అందుకే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు పదవులను బీసీలకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు రాజ్యసభ పదవులు కట్టబెట్టడం అభినందనీయమన్నారు. Andhra…
మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే…
ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించిన ఆయన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును, సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థులుగా…
త్వరతోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. అందులో ఒకటి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. ఇక, ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.. ఈ సారి విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇవాళ…
బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభలో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్‌గా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. ఇక, ఆర్.కృష్ణయ్య ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆర్. కృష్ణయ్య… గతంలో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహించారు.. ఇప్పుడు ఆర్.…
కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్…
రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది ఎంపీల పదవీ కాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1లోపు పూర్తి కానుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉండగా.. ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 రాజ్యసభ స్థానాలు…
తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ మేరకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు…