Nirmala Sitharaman: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాల వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్.. సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర…
Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే…
రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్‌గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్‌వైస్ చైర్మన్‌గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ…
National Clean Air Programme: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని పట్ణాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన అశ్వినీకుమార్ చౌబే.. 15వ ఆర్థిక సంఘం…
Central Government: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని..…
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు…