భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చాయి. ఇక భారత్-అమెరికా మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మంగళవారం ఈ భేటీ జరగనుంది. జూలై 21 నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో హిందీ వివాదం నడుస్తోంది. కేంద్రం బలవంతంగా తమిళనాడుపై హిందీ రుద్దుతోందని డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన దగ్గర నుంచి డీఎంకే సభ్యులు... ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు తమిళనాడులో త్రిభాషా ఉద్యమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఇలా హిందీ వివాదం జాతీయ స్థాయిలో ఉద్రిక్తంగా సాగుతోంది.
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ వైపు స్వాతి మలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్‌ను కొట్టిన కేసు ఇప్పుడు ఊపందుకుంది. అంతకుముందు స్వాతితో బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించాడని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించగా.. శుక్రవారం ఆప్ యూటర్న్ తీసుకుంది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈరోజు రిటర్నింగ్ అధికారి నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యసభకు తనను పంపినందుకు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనగానే నాయకుల ఇళ్లకు ఈడీ అధికారులు…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్…