రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. .. ఆంధ్రప్రదేశ్లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే, ఏపీలోని రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.. మూడు సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి ముగ్గురు నామినేషన్ల దాఖలు చేశారు..
BJP: లోక్సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన…
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…
1. నేడు హైదరాబాద్లోని రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలతో మాట్లాడనున్న గవర్నర్ తమిళసై. 2. ఢిల్లీ పీజీ మెడికల్ సీట్ల వివాదంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. 1,456 పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 3. నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్పై…