AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి అన్ని పార్టీలు.. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు..
Read Also: Lok Sabha Elections 2024: నేడు తెలంగాణలో 3 చోట్ల అమిత్ షా, 2 చోట్ల రాహుల్ గాంధీ సభలు..
నేడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ధర్మవరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ధర్మవరం బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు కీలక నేతలు. ఇక, ఏపీ నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు అమిత్‌షా. మరోవైపు.. ఇవాళ ఏపీకి కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ రానున్నారు.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కడప చేరుకోనున్న రాజనాథ్ సింగ్.. అక్కడి నుంచి ఎర్రగుంట్ల హెలిపాడ్ కు చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం 12:25 కు జమ్మలమడుగు బహిరంగసభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకూ బహిరంగ సభలో జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధి ఆదినారాయణతో కలిసి సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ఆధోని చేరుకోనున్న రాజనాథ్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకూ ఆధోనిలో అక్కడి అసెంబ్లీ అభ్యర్ధి పి.వి.పార్ధసారధితో కలిసి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.. అనంతరం కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయల్దేరి లక్నో వెళ్లనున్నారు రాజ్‌నాథ్ సింగ్.