Crime: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ అన్నయ్య రామ్ కుమార్ బిందాల్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. డాక్టర్ అయిన రామ్ కుమార్ తనకు చికిత్స చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. అత్యాచార బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. చికిత్స చేసినప్పటికీ తనకు ఎటువంటి ఉపశమనం లభించలేదని ఆమె అన్నారు.…
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.