మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ రెండవ దశ సంగతన్ పర్వ్ (సంస్థాగత డ్రైవ్)లో భాగంగా కొత్త బాధ్యతలు అప్పగిస్తోంది. కాగా.. బీజేపీ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తన అంతర్గత సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసింది.
READ MORE: Imran Khan: చీకటి గదిలో జీవించడానికైనా సిద్ధం.. కానీ, బానిసత్వం వద్దు
అయితే, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా వంటి కీలక రాష్ట్రాల్లో అంతర్గత ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు రోజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు నియమితులైన విషయం తెలిసిందే. ఈ నియామకం తర్వాత పార్టీలో గందరగోళం ఏర్పడింది. బీజేపీ సీనియర్ నాయకుడు రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
READ MORE: Sigachi Company: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!
మధ్యప్రదేశ్ – హేమంత్ ఖండేల్వాల్
మహారాష్ట్ర – రవీంద్ర చవాన్
తెలంగాణ – ఎన్. రాంచందర్ రావు
ఆంధ్రప్రదేశ్ – పీవీఎన్ మాధవ్
ఉత్తరాఖండ్ – మహేంద్ర భట్
హిమాచల్ ప్రదేశ్ – రాజీవ్ బిందాల్
పుదుచ్చేరి – వీపీ రామలింగం
మిజోరం – బీచువా
అండమాన్ & నికోబార్ దీవులు – అనిల్ తివారీ