టీమిండియా బ్యాటర్ రజత్ పటీదార్ తన కెప్టెన్సీ మాయను మరోసారి చూపాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను విజేతగా నిలిపిన పటీదార్.. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్‌కు టైటిల్ అందించాడు. ఫైనల్‌లో సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ ఏ వికెట్లను కోల్పోయి ఛేదించింది. పటీదార్ నాయకత్వంలో వరుసగా రెండో టైటిల్‌ను సెంట్రల్ జోన్ గెలిచింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…
దేశవాళీ క్రికెట్‌లో నయా సెన్సేషన్. దులిప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో బ్యాటర్ డానిష్ మలేవర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దులిప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ మలేవర్ డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. మొదటిరోజు ఆటలో 35 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 198 పరుగులు బాదాడు. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదర్భకు చెందిన…
ఆర్సీబీ ఆటగాళ్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వారికి ఇంకా పరిస్థితి తెలియకపోవచ్చు. అయితే.. సంఘటనలు జరిగినప్పటికీ వేడుకలు ప్రణాళిక ప్రకారం కొనసాగడం ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఈ వేడుకలను ఉద్దేశించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. నినాదాలను ఆపివేయమని కోరాడు.
RCB vs PBKS: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చివర్లో తడబడటంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ముందు 191 పరుగుల లక్ష్యం ఉంచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. Read Also: IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ మధ్య హైఓల్టేజ్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్…
రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్…
ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్…
చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్‌కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్..
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి.. ఐదు విజయాలు సాధించింది. ఈ ఐదు విజయాలు బయటి మైదానాల్లో సాధించినవే కావడం గమనార్హం. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోయింది. నేడు సొంత మైదానంలో ఆడేందుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ హోంగ్రౌండ్ ప్రదర్శనపై స్పందించాడు. ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదన్నాడు. ‘చిన్నస్వామి స్టేడియం పిచ్‌లు కాస్త…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.