RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- చివరి అంకానికి ఐపీఎల్ 2025
- అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్
- ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్స్ రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్ సోమవారం ట్రోఫీతో ఫోటోలకు పోజులు ఇచ్చి.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్ పటీదార్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కోసం అయినా టైటిల్ సాధించేందుకు ప్రయత్నిస్తాం అని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా టీమిండియా, ఆర్సీబీకి ఎంతో సేవ చేశాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ముఖ్యం. కోహ్లీ, ముఖ్యంగా అతడి అభిమానుల కోసం ట్రోఫీ గెలవాలి. ఆర్సీబీ ఫాన్స్ మాకు ఎంతో మద్దుతుగా ఉంటారు. ఫైనల్‌లో వంద శాతం గెలవడానికి ప్రయత్నిస్తాం. ఏ ఒక్క చిన్న అవకాశంను వదలం’ అని పటీదార్ తెలిపాడు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Also Read: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేదు. కెప్టెన్‌గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. పలు సారథుల నాయకత్వంలో బ్యాటర్‌గా కష్టపడ్డా ఫలితం లేకపోయింది. ఇటీవల ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరినా.. ఒత్తిడికి చిత్తై ఫైనల్ చేరలేదు. ఈసారి కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ సారథ్యంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ.. గొప్పగా ఆడి ఫైనల్ చేరింది. విరాట్ కూడా బాగా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శనను ఇంకొక్క మ్యాచ్‌లో కొనసాగిస్తే.. 18 ఏళ్ల కల నెరవేరుతుంది. ఫైనల్లో విరాట్ మేటి ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!