Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!
- తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
- ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ఆర్సీబీ
- ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకా ఒక్క మ్యాచే మిగిలి ఉందని, కలిసి సంబరాలు చేసుకుందామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ అభిమానులకు పిలుపునిచ్చాడు. చిన్నస్వామి స్టేడియమే కాదు.. ఎక్కడ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీపై ఆదరణ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని, స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం అని పాటీదార్ ప్రశంసించాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ… ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో మా ప్రణాళికలు, ఎలా బౌలింగ్ చేయాలనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఫాస్ట్ బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారు. బాగా బౌలింగ్ చేశారు. సుయాశ్ శర్మ బౌలింగ్ అద్భుతం. లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు బౌలింగ్ విధానం బాగుంది. ఓ కెప్టెన్‌గా సుయాశ్ ఎలా బౌలింగ్ చేస్తాడో నాకు అవగాహన ఉంది. వికెట్లను లక్ష్యంగా చేసుకొని బంతులు వేస్తాడు. అదే అతడి బలం. సుయాశ్ బౌలింగ్‌ను బ్యాటర్లు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటా. సుయాశ్‌ను కంగారు పెట్టడం ఇష్టం లేదు, కొన్నిసార్లు పరుగులు ఇచ్చినా మద్దతుగా ఉంటా’ అని చెప్పాడు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
‘టోర్నమెంట్ అంతటా మేము చాలా ప్రాక్టీస్ చేసాము. ప్రతి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం బాగుంటుంది. సాల్ట్ శుభారంభం గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. నేను అతడికి పెద్ద అభిమానిని. డగౌట్ నుండి సాల్ట్ బ్యాటింగ్ చూడడం బాగుంటుంది. ఆర్సీబీ అభిమానులకు మా కృతజ్ఞతలు. చిన్నస్వామి స్టేడియమే కాదు మేము ఎక్కడ ఆడినా దాన్ని మా హోమ్ గ్రౌండ్ లానే భావిస్తాము. మాకు ఎంతో మద్దతు ఇస్తారు. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. కలిసి సంబరాలు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి’ అని రజత్ పాటీదార్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!