RCB vs PBKS: చివర్లో తడబడ్డ ఆర్సీబీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
- ఐపీఎల్ ఫైనల్ లో తడబడిన ఆర్సీబీ..
- నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- చివరి ఓవర్లలో 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బకొట్టిన అర్ష్‌దీప్ సింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs PBKS: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చివర్లో తడబడటంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ముందు 191 పరుగుల లక్ష్యం ఉంచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
Also Read
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 16 పరుగులతో జట్టు కు ఫ్లైయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్థిరంగా ఆడుతూ 35 బంతుల్లో 43 పరుగులు (3 ఫోర్లు) చేశాడు. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24), కెప్టెన్ రాజత్ పటీదార్ (16 బంతుల్లో 26), లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 25), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24) రాణించినా, మిగితావారు వారు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 58 పరుగులు మాత్రమే సాధించి 5 వికెట్లు కోల్పోయింది. ఈ తడబాటు కారణంగా 200 మార్క్ దాటలేకపోయింది.
ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసాడు. అలాగే కైల్ జేమీసన్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఓమర్జాయ్, విజయ్ కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చహల్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!