కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు త్వరగా ఔటైనా బట్లర్ ఒక్కడే నిలబడ్డాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి చివర్లో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్…
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా…
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో…
కామెంటరీలో తమ ప్రత్యేకత చాటుకోవాలని.. పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకోవాలన్న మోజులో కొందరు దిగ్గజాలు హద్దు మీరుతున్నారు. క్రికెట్‌పై తమకున్న అనుభవాన్ని రంగరించి, వాక్చాతుర్యంతో రక్తి కట్టించాల్సిన వీళ్ళు.. వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడుతూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒకరు. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కామెంట్ చేయబోయి, అతని భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు మరోసారి హెట్మెయర్,…
నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే మిగతా ఆటగాళ్లు కనీస పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో చాహల్, ఒబెడ్ మెకాయ్ రెండేసి వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్…
ఐపీఎల్‌లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్‌గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ చేరడంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది. దీంతో లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రంగా మిగలనుంది. ఈ మ్యాచ్ గురించి ఎన్టీవీ స్పెషల్ లైవ్ విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో పెద్దగా సత్తా చాటని యువ ఆటగాళ్ళు.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్ క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే లక్నో బౌలర్స్‌పై దండయాత్ర చేశాడు. దీంతో 29 బంతుల్లో 6 ఫోర్లు 1…
ఐపీఎల్‌లో బుధవారం రాత్రి రాజస్థా్న్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ డకౌట్‌గా వెనుతిరిగినా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో…
ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిసిన ఢిల్లీ, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. బ్యాటింగ్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన.. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు), పడిక్కల్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో…