ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరువైంది. ఈ నేపథ్యంలో జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే.. ఐపీఎల్-2022లో భాగంగా క్వాలిఫైయర్-2లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్