లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. డికాక్ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా…
ఐపీఎల్ -16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు.. గడిచిన మూడు రోజులుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లలో ఫలితాలు తేలుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అదే బాటలో కొనసాగింది. రవీంద్ర జడేజా ( 15 బంతల్లో 25 నాటౌట్, సిక్స్ ), వరల్డ్ బెస్ట్ ఫినిషిర్ ఎంఎస్ ధోని ( 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు )తో ధనాధన్ ఇన్సింగ్స్ తో మ్యాచ్ కు థ్రిల్లింగ్ ఎండింగ్ ఇచ్చే…
IPL 2023 : క్రికెట్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. అతని నాయకత్వంలో భారత జట్టు ఎన్నో అద్భుతాలు సృష్టించింది. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు రెండింట్లో ఓటమి మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని చూస్తోంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. ఢిల్లీ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది.