ఐపీఎల్ 2023లో వరుసగా మూడు మ్యాచ్ లో గెలవాలన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై రాజస్థాన్ రాయల్స్ నీళ్లు చల్లింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్థా్న్ రాయల్స్ గెలిచింది. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరి వరకు పోరాడినప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఆఖరి ఓవర్ లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవసరమైన టైంలో.. సందీప్ శర్మ రెండు వైడ్స్ వేసి దానిని 19 పరుగులకు తెచ్చాడు. దీంతో 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లో 172 పరుగులు చేసి ఓటమిపాలైంది.
Read Also : Ramabanam: పంచెకట్టిన మ్యాచో స్టార్ గోపీచంద్…
ఆఖరి ఓవర్ లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. సందీప్ శర్మ 19 పరుగులు మాత్రమే చేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే.. సీఎస్కే ఇన్సింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్ ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా అశ్విన్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.
Read Also : Dil Raju Rajinikanth: ఈ షాకింగ్ కాంబో ఏంది సామి…
మూడో బంతిని అశ్విన్ వేసే క్రమంలో రహానే ఒక్క సారిగా క్రీజు నుంచి పక్కకు వెళ్లిపోయాడు. అనంతరం మూడో బంతిని రహానే అద్భుతమై సిక్స్ గా మలిచాడు. దీంతో అశ్విన్ ఒక్కసారిగా రహానే వైపు సీరియస్ గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… అశ్విన్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఏంటీ అశ్విన్ ప్రతీసారి ఇలానే చేస్తున్నావు.. రహానే సరైన సమాధానం చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.