Royal Challengers Bangalore Scored 101 In First 10 Overs: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 53) అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అటు.. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అర్థశతకం వైపు దూసుకెళ్తున్నాడు. నిజానికి.. తొలి బంతికే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం, అనంతరం 12 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేరడంతో.. ఆర్సీబీ పనైపోయిందని అంతా అనుకున్నారు. మొదట్లోనే రెండు వికెట్లు పడ్డాయన్న ఒత్తిడితో.. ఆర్సీబీ బ్యాటర్లు చేతులు ఎత్తేయొచ్చని, తక్కువ స్కోరుకే ఆ జట్టు తట్టాబుట్టా సర్దేయొచ్చని అంతా భావించారు. కానీ.. ఆ అంచనాలని తలక్రిందులు చేస్తూ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ బౌండరీల మీద బౌండరీలు బాదుతున్నారు.
Rohit Sharma: రోహిత్ శర్మ సరికొత్త రికార్డ్.. తొలి భారత క్రికెటర్‌గా..
క్రీజులోకి అడుగుపెట్టిన తొలి బంతికే మ్యాక్స్‌వెల్ ఫోర్‌తో తన ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టాడు. ఇక అప్పటినుంచి తన 360 డిగ్రీ ఆటతో అతడు చెలరేగిపోతున్నాడు. తనకు అనుకూలమైన బంతి వచ్చిందంటే చాలు.. బంతిని జనాల్లోకి పంపించేస్తున్నాడు. అలాగని ప్రతీ బంతికీ టెంప్ట్ అవ్వట్లేదు. టెంప్టింగ్ బంతులు వచ్చిన ప్రతీసారి.. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బ్యాట్‌కి ఏదైనా బంతి అందితే.. ఇక బౌండరీనే. ఇలా చితక్కొడుతున్నాడు కాబట్టే.. డు ప్లెసిస్ కంటే ఆలస్యంగా వచ్చి, తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. కెప్టెన్ డు ప్లెసిస్ కూడా ఎడాపెడా షాట్లతో దుమ్ముదులిపేస్తున్నాడు. ఇక రాజస్థాన్ బౌలర్ల విషయానికొస్తే.. ట్రెండ్ బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ వేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వికెట్లు తీయడానికి తంటాలు పడుతున్నారు. మరి.. మరో 10 ఓవర్ల ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలి.
Bhatti Vikramarka: ప్రజల్లో కాంగ్రెస్ ఉండకూడదని.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి