IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 15 సార్లు విజయం సాధించగా, రాజస్థాన్ 11 మ్యాచుల్లో గెలిచింది. టాస్ ఓడి పోయిన రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మైదానంలోకి అడుగుపెట్టారు. ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్ లో యశస్వి జైస్వాల్ రెండు బౌండరీలు కొట్టాడు. 10 పరుగుకే చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. యశస్వి జైస్వాల్ ఔట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడుతున్నాడు. మహేశ్ తీక్షణ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. దూకుడుగా ఆడేందుకు యత్నించే క్రమంలో మహేశ్ తీక్షణ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ స్లిప్‌లో జారవిడిచారు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని బట్లర్ సిక్స్ కొట్టాడు.
Read Also: IPL 2023 : చరిత్ర సృష్టించిన ధోని.. సీఎస్‌కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్
తుషార్ దేశ్‌పాండే వేసిన ఆరో ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే పూర్తి కాగానే కెప్టెన్ ధోనీ.. జడేజా చేతికి బంతినిచ్చాడు. అయితే.. తొలి బంతిని లెగ్ సైడ్ వేయగా కొట్టడంలో బట్లర్ విఫలం అయ్యాడు. బంతి వైడ్‌గా వెళ్లింది. ధోనికి కూడా బంతి అందకపోవడంతో బౌండరీకి వెళ్లింది. ఎక్స్‌ట్రాల రూపంలో 5 వైడ్‌లు వచ్చాయి. మొత్తంగా ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన బట్లర్ క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. మోయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. దూకుడుగా ఆడే క్రమంలో దేవదత్ పడిక్కల్ ఔట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో డేవాన్ కాన్వే క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. పడిక్కల్ 26 బంతుల్లోనే 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. దూకుడుగా ఆడుతున్న పడిక్కల్ తో పాటు ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సంజు శాంసన్‌ను వికెట్లు తీశాడు. ఈ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 9 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 88/3. బట్లర్ 34, అశ్విన్ 0 పరుగుతో ఉన్నారు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోవడంతో గత మూడు ఓవర్లుగా రాజస్థాన్ పరుగుల వేగం నెమ్మదించింది. మగాలా వేసిన 12వ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 104/3. బట్లర్ 41, అశ్విన్ 8 పరుగులతో ఉన్నారు.
Read Also: Botsa Satyanarayana: మా గురించి ఎందుకు..? మీ సంగతి చూసుకోండి..
ఆకాశ్ సింగ్ వేసిన 15 ఓవర్‌లోని రెండు, మూడు బంతులను అశ్విన్ సిక్సర్లుగా మలిచాడు. అదే ఊపులో ఆఖరి బంతిని భారీ షాట్‌కు యత్నించి మగాలా చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ 22 బంతుల్లో 1ఫోరు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 135/4. జోస్ బట్లర్ 48 పరుగులతో ఉన్నాడు.