Rajasthan Royals Needs 190 Runs To Win Against RCB: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఇన్నింగ్స్ మునిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (62), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77) అద్భుతంగా రాణించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. ఒకవేళ ఆ ఇద్దరితో పాటు ఇద్దరు బ్యాటర్లు కూడా రాణించి ఉంటే.. ఆర్సీబీ తప్పకుండా 200 కంటే ఎక్కువ స్కోరు చేసి ఉండేది. నిజానికి.. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ చేసిన తాండవం చూసి.. ఆర్సీబీ సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటేస్తుందని, రాజస్థాన్ జట్టుకి భారీ లక్ష్యం నిర్దేశిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆ ఇద్దరు ఔటయ్యాక ఆర్సీబీ పేకమేడల్లా కుప్పకూలింది. ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. 189 పరుగులకే ఆర్సీబీ పరిమితం అయ్యింది.
Komatireddy Venkat Reddy: వెంకటరెడ్డి సవాల్.. అది అబద్ధమైతే రాజీనామాకు సిద్ధం
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఆర్సీబీ జట్టుకి మొదట్లోనే పెద్ద ఝలక్ తగిలింది. ట్రెండ్ బౌల్డ్ బౌలింగ్‌లో మొదటి బంతికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ఆ వెంటనే 12 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేరాడు. ఇలా మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో.. ఆ ఒత్తిడిలో ఆర్సీబీ బ్యాటర్లు పెద్దగా రాణించకపోవచ్చని భావించారు. వికెట్లు కాపాడటంలో బంతులు వృధా చేస్తారేమోనని అంచనా వేశారు. కానీ.. ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ.. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఊచకోత కోశారు. రాజస్థాన్ బౌలర్లపై ఆ ఇద్దరు దండయాత్ర చేశారు. ఎడాపెడా బౌండరీలతో పరుగుల వర్షం కురిపించారు. మూడో వికెట్‌కి వీళ్లిద్దరు కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారంటే.. ఏ రేంజ్‌లో ప్రభంజనం సృష్టించారో మీరే అర్థం చేసుకోండి. 13 ఓవర్లలోనే 130+ స్కోర్ ఉండటం చూసి.. ఆర్సీబీ తప్పకుండా 200 పరుగులకి పైగా స్కోరు చేస్తుందనే అభిప్రాయాలు అందరిలోనూ నెలకొన్నాయి.
Animal: ఇదేందయ్యా.. ఇది.. సినిమా చూడాలంటే వారి పర్మిషన్ కావాలా..?
కానీ.. ఎప్పుడైతే వాళ్లు ఔట్ అయ్యారో, అప్పటి నుంచి ఆర్సీబీ పతనం మొదలైంది. ఎవ్వరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. దీంతో.. 9 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ 189 పరుగులే చేసింది. లక్ష్యం చూడ్డానికి పెద్దగానే అనిపించినా.. చిన్నస్వామి లాంటి స్టేడియంలో మాత్రం దాన్ని ఛేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. రాజస్థాన్ టీమ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి.. మొదటి నుంచి ఊచకోత కోస్తే, ఆ లక్ష్యాన్ని ఛేధించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి.. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలంటే, బౌలర్లు తప్పకుండా మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు కట్టడి చేయడం, సమయానుకూలంగా వికెట్లు తీయడం చేస్తే.. ఈజీగా గెలవచ్చు. అలా కాకుండా కాస్త డీలాగా బౌలింగ్ వేసినా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి.. ఆర్సీబీ బౌలర్లు ఆ స్కోరుని డిఫెండ్ చేస్తారా? లేదా రాజస్థాన్ ఛేధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!