లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్వింటన్ డికాక్ ను తాను చాలా మిస్సవుతున్నట్లు జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో లక్నో తలపడుతుంది. టాస్ సమయంలో కేఎల్ రాహుల్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. గతేడాది ఐపీఎల్ లో క్వింటన్ డికాక్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన కనబరిచాడు. కేఎల్ రాహుల్ తో కలిసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు నిర్మించిన డికాక్ 148.97 స్ట్రైక్ రేట్ తో 508 రన్స్ చేశాడు.
Also Read : Ram Charan: చరణ్ కీలక నిర్ణయం.. నవ్వాలో.. ఏడవాలో తెలియడం లేదు బ్రో..?
అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో డికాక్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దానికి ఒక కారణం ఉంది. జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండాలనే నిబంధన ఒకటి అయితే మరొకటి డికాక్ స్థానంలో ఓపెనర్ గా వచ్చిన కైల్ మేయర్స్ అంచనాలకు మించి రాణిస్తుండడమే ఇందుకు కారణం. వన్డే మ్యాచ్ ల కారణంగా తొలి రెండు మ్యాచ్ లకు డికాక్ అందుబాటులో లేడు. దీంతో అతని స్థానంలో మేయర్స్ ఓపెనర్ గా వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కైల్ మేయర్స్ టాస్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఆరు ఇన్సింగ్స్ లు కలిసి 198 స్ట్రైక్ రేట్ తో 219 పరుగులు చేశాడు. అతని ఖాతాలో హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read : Tarun Chugh : కేసీఆర్ తెలంగాణ నయా నిజాం
ఓపెనింగ్ స్లాట్ లో కాదని మిగతా స్థానాల్లో ఆడిద్దామంటే నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ లు ఉన్నారు. ఒక బౌలర్ల కోటాలో మార్క్ వుడ్ లేదా రొమారియో షెపర్ట్ లకు చోటు దక్కుతుంది. దీంతో 6.75 కోట్లకు రిటైన్ చేసుకున్న డికాక్ బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. ఓపెనర్ గా రావాల్సిన వ్యక్తి డ్రింగ్స్ మోస్తూ కనిపించడం ఆసక్తి కలిగించింది. డికాక్ ను చాలా మిస్సవుతాున్నా.. కానీ ఏం చేయలేని పరిస్థితి అని కేఎల్ రాహుల్ అన్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ లో నాతో కలిసి మంచి ఓపెనింగ్ చేసి జట్టును ప్లేఆఫ్స్ కి తీసుకెళ్లాడు. కానీ ఈసారి అతను వచ్చేసరికే జట్టులో ఉన్న నలువురు విదేశీ ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఓపెనర్ గా అద్భుత ప్రదర్శన చేస్తుండడంతో అతన్ని పక్కనబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. డికాక్ అవకాశం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.