ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ని సంజూ శామ్సన్, హైదరాబాద్‌ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గత సీజన్ ( 2022 ) నుంచి పేలవమైన ప్రదర్శనతో చిరాకు తెప్పించే ఆట ఆడుతున్నాడు పరాగ్. గుజరాత్ ( మే 5 ) తో జరిగిన మ్యాచ్ లో 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిపోయాడు. ఈ సీజన్‌లో అతను ఆడిన ఆరు మ్యాచ్‌లు ఒక్క…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 1000 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని సంజూ శాంసన్ అన్నాడు. టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ వెల్లడించాడు.
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.