Garba Rules: ఉత్తరాదిన నవరాత్రుల్లో జరిగే ‘‘గర్బా’’ వేడుకల కోసం పలు హిందూ సంఘాలు నిమయాలను రూపొందించాయి. పలు సందర్భాల్లో గర్భాలోకి అన్యమతస్తులు ప్రవేశించడం, గర్బా డ్యాన్సు చేస్తున్న మహిళల్ని వెక్కిరించడం లేకుంటే ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి ఘటనలు జరిగాయి.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్‌ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్‌తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు.
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు.
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Aam Aadmi Party: ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రీసెంట్‌గా పంజాబ్‌లోనూ పవర్‌లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్ తెరిచింది.