శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనకారులు ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన అందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాల నుంచి అవసరమైన సరుకులను దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా మందులు, ఇంధనం, ఆహారంతోపాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల పట్ల నిరసనకారులు ఆందోళనలు చేస్తూనే వున్నారు. మరోవైపు…