తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మం) చింతల్ ఠాణ గ్రామ సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మృతి చెందిన వ్యక్తి సర్పంచ్ గా విజయం సాధించడంతో గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచుగా చనిపోయిన వ్యక్తి చెర్ల మురళి గెలుపొందారు. Also Read:Tirumala Darshan Tickets:…
ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కారు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కారు డ్రైవర్ తీరుపై ప్రజలు మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుతో ఆ కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరవకముందే మళ్లీ ఇదే జిల్లాలో తన బైకుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్‌లో ఉన్న…
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తుల రద్దీతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో, ఈసారి కూడా నెల రోజులపాటు భక్తి ఉత్సవాలకు శుభారంభం అయింది. ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉండటంతో.. ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ లింగార్చన కార్యక్రమం జరగనుంది. Myntra: మింత్రాకు…
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా మరో ఐదు కోడెలు మృతి చెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.…
పాము.. ఆ పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది. అలాంటిది తుప్పల్లో, పుట్టల్లో ఉండే పాములు ఇంట్లోకి వస్తే భయంతో పరుగులు తీయాల్సిందే. పాము కాటుతో ప్రాణాలకే ప్రమాదం. అప్పుడప్పుడు ఇళ్లలోకి చేరి హల్ చల్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో షూస్, హెల్మెట్స్, బైక్ లలో పాములు దూరిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బైకులోకి పాము దూరింది. ఈ విషయాన్ని గమనించిన బైక్ ఓనర్ మెకానిక్…
ఇద్దరి ఇష్టాలతో జరిగితేనే ఆ పెళ్లికి ఓ అర్థం. ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వారి దాంపత్య జీవితం నిత్య నరకమే. అందుకే అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే ముందుకు సాగుతుంటారు పెద్దలు. ఇదే విధంగా ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇక్కడే…
నేత కార్మికుల జీవితాలు గాల్లో దీపాలుగా మారాయి. ఉపాధి లేక.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఉరిపోసుకుంటున్నారు. అప్పుల్లో కూరుకుపోయి వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడుతోంది. తాజాగా మరో నేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కు చెందిన బత్తుల విఠల్ (54) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read:House of Horror:…
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. చపాతీలు తిన్న కాసేపటికే తల్లీ కొడుకులిద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తల్లి పుస్పలత (35), కొడుకు నిహాన్ (6)ను సమీప ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తల్లి పుష్పలత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరుసటి రోజు నిహాల్ (6) కూడా మృతిచెందాడు. Also Read:MI vs RCB: రజత్ పాటిదార్, విరాట్…