Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తుల రద్దీతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో, ఈసారి కూడా నెల రోజులపాటు భక్తి ఉత్సవాలకు శుభారంభం అయింది. ఈ శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉండటంతో.. ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ లింగార్చన కార్యక్రమం జరగనుంది.
Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!
అలాగే ఐదు శుక్రవారములు మహాలక్ష్మీ అమ్మవారికి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవికి షోడశోపచార పూజలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈరోజు తొలి శుక్రవారం కావడంతో, శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు చక్కగా నిర్వహించారు. దీనితో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కులు చెల్లించడమే కాక, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.
Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
వచ్చే నెల 9న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఋగ్వేద, యజుర్వేద ఉపాకర్మ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేదపాఠశాలల వేదపండితుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు సాగనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో నెల రోజులపాటు జరిగే ఈ శ్రావణమాస మహోత్సవాలు భక్తులను ఆధ్యాత్మికంగా అలరించనున్నాయి.