రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. చపాతీలు తిన్న కాసేపటికే తల్లీ కొడుకులిద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తల్లి పుస్పలత (35), కొడుకు నిహాన్ (6)ను సమీప ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తల్లి పుష్పలత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరుసటి రోజు నిహాల్ (6) కూడా మృతిచెందాడు.
Also Read:MI vs RCB: రజత్ పాటిదార్, విరాట్ మెరుపులు.. ముంబై లక్ష్యం ఎంతంటే?
తల్లీకొడుకుల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా తల్లీకొడుకుల మృతికి పుడ్ పాయిజన్ కారణం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అత్తింటి వేధింపుల వల్లే తల్లి కొడుకులు చనిపోయారని ఆరోపిస్తూ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు మృతిరాలి బందువులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.