పర్యాటక ప్రియుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు. ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు…
మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ…
ఈజీమనీ కోసం దొంగతనాలు చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఆటలు సాగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేసేవారు గుట్టు రట్టవుతోంది. సీసీ కెమేరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా దొంగల్ని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీపీఎస్ ద్వారా బుల్లెట్ దొంగలు పట్టుబడ్డారు. కడియపులంకలో చోరీకి గురైన రెండు లక్షల రూపాయల బుల్లెట్ జీపీఎస్ ద్వారా గుర్తించారు పోలీసులు. చోరీకి గురైన తన…
గలగల గోదావరి.. ఆ చల్లని గోదారమ్మ ఒడిలో సేదతీరుతూ మనకిష్టమయిన ఆహారం తింటే భలేగా వుంటుంది కదూ. ఈ ఆలోచన పర్యాటక శాఖ వారికి వచ్చింది. రాజమండ్రి వద్ద గోదావరి నదిలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. 70 లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్ ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్…
గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు వుండరు. చాలాకాలంగా పాపికొండలకు వెళ్ళాలనుకునేవారికి నిరాశే కలిగింది. అయితే పరిస్థితులు మారడంతో ప్రభుత్వం పాపికొండల టూర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి పాపికొండల సందర్శనకు పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం అవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్ గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు. పాపికొండల…
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ బంద్ కార్యక్రమంలో పాల్గొన కుండా బుచ్చయ్యరు గృహ నిర్బంధం చేశారు పోలీస్ అధికారులు. వైసిపి నాయకులు తమనేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారని, మా మీద జరిగిన దాడులు ఖండించడానికి మేము బయటకు వెళ్లకూడదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను…
కలిసి పనిచేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా ఆ యువ నేతలు ఖాతరు చేయడం లేదా? ఇప్పటికీ ఎడముఖం పెడముఖమేనా? అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా? ఎవరా నాయకులు? ఏమా కథ? కలిసి మీడియా ముందుకు రాలేదు..! రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య రగడపై పది రోజుల క్రితమే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎదుట పంచాయితీ జరిగింది. ఇద్దరినీ కలిసి పనిచేయాలని అధినేత ఆదేశించినట్టు సమాచారం. కానీ.. క్షేత్రస్థాయిలో వర్గాలు ఏకం…
రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల్లాడుతూ.. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని వెల్లడించారు. తనది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తనకు కడుపులో మంట వచ్చేదని… ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదన్నారు. అల్లు రామలింగయ్యగారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి…