Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది.. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. వరుసగా రెండు రోజులపాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రోన్ ప్రయోగించినవారిని గుర్తించేందుకు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్నారు.. ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా డ్రోన్ ఎగరవేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు ములాఖత్‌లో కలుస్తూ వస్తున్నారు.. కానీ, ఈ సమయంలో.. అది కూడా వరుసగా రెండు రోజుల పాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది..
Read Also: Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు