రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ ( TDP ) అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇక, నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేస్తారని వెల్లడించారు.
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జి చెల్లుబోయిన వేణు.. ట్రబుల్ షూటర్ ను కాబట్టి నన్ను రాజమండ్రి రూరల్‌కి పంపించారని తెలిపారు. తొలి సారి రాజమండ్రి రూరల్ లో వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రామచంద్రపురం లో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడుకి సపోర్ట్ చేస్తానని ప్రకటించారు.