సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్- సెక్రటేరియట్ సూచనలకు అనుగుణంగా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి స్వీకరించడం) బిల్లు-2023తో సహా రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి అందిన అన్ని బిల్లులు చట్ట కార్యదర్శికి సిఫార్సు చేయబడ్డాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇక, తెలంగాణ అసెంబ్లీలోని శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై కన్సెంట్ ఇచ్చింది.
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
నేడు తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రొగ్రాంకు సీఎం కేసీఆర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
Governor Tamilisai: అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై.
జూన్ ఒకటి నుంచి జూన్ 7 వరకు పార్లమెంట్ వారిగా మీడియా సమావేశాలు, సోషల్ మీడియా influencer లతో సమావేశం.. వికాస్ తీర్థ పేరుతో కేంద్ర అభివృద్ది సంక్షేమ పథకం విజిట్.. దీనికి కేంద్ర మంత్రి, జాతీయ నేతలు హాజరు అవుతారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.