Off The Record: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ ఇంకా తగ్గలేదా..? తమిళిసై నెక్స్ట్ స్టెప్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్యాచ్‌వర్క్ పూర్తిగా జరగలేదా? ఆ మాటకొస్తే.. అసలా ప్రయత్నమే లేదా? అంతరాల్లోని అగాధాలను అలాగే ఉంచుకుని తెలంగాణలోని రెండు పవర్ సెంటర్స్ సందర్భం వచ్చినప్పుడు పై పూతతో కవర్ చేసుకుంటున్నాయా? అంటే.. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను చూసి గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరిందని అనుకున్నారు అంతా. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గవర్నర్ తో కలిసి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఇటు చీఫ్ జస్టిస్ పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం కోసం రాజ్ భవన్‌కు కూడా వెళ్లారు. రెండూ ప్రోటోకాల్ ప్రోగ్రామ్సే అయినా… ఆ సందర్భంగా గవర్నర్ , సిఎం మాట్లాడుకున్నారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అది చూసి వాతావరణం చల్లబడుతోందనుకున్న వాళ్లకు తాజాగా కొత్త డౌట్స్ వస్తున్నాయట.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తాజాగా గవర్నర్‌కు పంపింది కేబినెట్. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను జులై 30న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపింది సర్కార్. 15 రోజులు అవుతున్నా.. ఆ పేర్లకు ఇంతవరకు ఆమోద ముద్ర పడలేదు. అటు గతంలో తిప్పి పంపిన 4 బిల్లులతో పాటు మరో 8 బిల్లులను గవర్నర్‌కు పంపింది ప్రభుత్వం.దీంతో ఇప్పుడు మొత్తం 12 బిల్లులు, రెండు ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ ఏం చేస్తారన్న విషయమై ఉత్కంఠ పెరుగుతోంది. అంతకుముందున్న అంతరాలు తొలిగిపోయి సాధారణ పరిస్థితులు వచ్చి ఉంటే.. బిల్లుల ఆమోదం విషయంలో ఇంత జాప్యం జరగదని, వాతావరణం చూస్తుంటే.. మేటర్ మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
గతంలో గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర క్యాబినెట్ ప్రతిపాదించడం, దాన్ని గవర్నర్ తిరస్కరించడం, తర్వాత మధుసూదనాచారికి ఓకే చెప్పడం లాంటి పరిణామాలతో పాటు పెండింగ్ బిల్లుల విషయంలో కూడా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య మాటల తూటాలు పేలాయి. బిల్లుల విషయంలో సుప్రీం కోర్ట్‌దాకా వెళ్ళింది కేసీఆర్ సర్కార్. ఈ పరిస్థితుల్లో తాజా బిల్లులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల విషయంలో గవర్నర్ వైఖరి ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో వాటిని గవర్నర్ ఇంకా పెండింగ్ పెట్టి నానుస్తారా? లేక తేల్చేసి వివాదానికి చెక్ పెడతారా అని చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఈ విడతతో ఎవరేంటో తేలిపోతుందని కూడా అంటున్నాయి.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!