హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు.
దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రోడ్లు నదులుగా మారుతున్నాయి.. కొన్ని ఊర్లు నీళ్లల్లో కొట్టుకొని పోయాయి.. ఈ వర్షాలు చాలా మంది జీవితం వర్షాలకు అతలాకుతలం అయ్యింది.. వర్షాలకు తడవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, అధికారులు పదే పదే చెబుతున్నా కూడా ఓ లవర్స్ జంట మాత్రం జోరు వానను లెక్క చెయ్యకుండా నడి రోడ్డు పై రొమాన్స్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.. ఇందుకు…
Hyderabad: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనను తాకుతూ నది ప్రవహిస్తూనే ఉంది.
Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున.. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అప్రమత్తం చేశారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా…