Heavy Rain in Telangana State: ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది. ఆదివారం నుంచి నిజామాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం…
భారత వాతావరణ శాఖ మహారాష్ట్ర రైతులకు శుభవార్త అందించింది. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే ఐదు రోజుల పాటు మహారాష్ట్రలో వర్ష సూచనను భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసింది.
వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
సుందరమైన హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో బీతావహంగా మారిపోతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం వేల కోట్ల నష్టపోయింది.
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రెండు రాష్ట్రాల్లో 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మేఘాలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా…