నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే..
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అందరికి తెల్సిందే. ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శప్రాయం. అయితే మనిషి అన్నాకా తప్పులు చేయకుండా ఉండడు. అది ఎంతటి దిగ్గజుడు అయినా కూడా. సూపర్ స్టార్ రజినీ కూడా తన జీవితంలో ఒక తప్పు చేశారట .. అదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అందరి ముందు ఒప్పుకోవడం విశేషం. నిన్న జరిగిన జైలర్ ఆడియో లాంచ్ లో రజినీ తాను చేసిన తప్పును బయటపెట్టారు. ఇంతకు రజినీ చేసిన తప్పు ఏంటంటే.. మద్యపానానికి బానిసగా మారడం, ఒకానొక సమయంలో ఆయన మందుకు అడిక్ట్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. దానివలన తాను చాలా కోల్పోయాను అని తెలిపారు.
“నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు మద్యానికి బానిసగా మారడం. అది లేకుండా ఉంటే .. సమాజానికి ఎంతో కొంత మేలు చేసేవాడిని. మద్యం సేవించకపోతే నేను జీవితంలో చాలా మెరుగ్గా రాణించి ఈ రోజు కంటే ముందే పెద్ద స్టార్‌గా ఎదిగి ఉండేవాడిని. మీరు కూడా మద్యం జోలికి వెళ్లకుండా బాధ్యతగా ఉండండి. అనుకున్నది సాధిస్తారు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒకానొక సమయంలో రజినీ మద్యపానంలో మునిగితేలేవారట. ఆ తరువాత దాన్ని నుంచి బయటపడి ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రజినీ ఈ సినిమాలతో హిట్స్ ను అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.
మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారు
నిజమాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారని మండిపడ్డారు. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేపట్టారని, మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో నాణ్యత పాటించక పోవడ వల్లే చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. నాసిరకంగా పనులు చేపట్టి కమిషన్లతో డబ్బులు వెనక్కి వేసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చింది లేదు, పరామర్శ చేసిన పాపాన పోలేదన్నారు.
మోతే సమీపంలో చెక్ డ్యాంల నిర్మాణాల లోపాల వల్లే వందలాది ఎకరాలు నిట మునిగాయని, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చిలెనోడు దేశ ప్రజల కష్టాలు తిరుస్తాడా..? అని ఆమె ప్రశ్నించారు. మంత్రి భరోసా ఇవ్వడం లేడు, సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించు కోవడం లేదని, రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నష్టపరిహారం వెంటనే అందించాలన్నారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలను సాగుకు యోగ్యంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన డీకే. అరుణ ఆరోపించారు.
మార్నింగ్ వాకింగ్కు వెళ్లి.. అనంత లోకాలకు
మృత్యువు ఏ రూపంలో వచ్చి బలి తీసుకుంటుందో తెలియదు. మార్నింగ్ వాకింగ్ కు అని వెళ్లిన ఇద్దరు మహిళలు.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డుపైనే నడుచుకుంటు వెళ్తుండగా.. స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రీసాలా బజార్ కు చెందిన రాధిక (48) బొల్లారం కలాసిగూడ సాయి కాలనీకీ చెందిన పొలం బాలమని యాదవ్ (60) లు వీరిద్దరు మంచి స్నేహితులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు బొల్లారంలోని కంటోన్మెంట్ బోర్డు పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో వాకింగ్ కు బయలుదేరారు. కొద్దిసేపట్లోనే కంటోన్మెంట్ బోర్డు పార్క్ లోపలికి చేరుకొనే క్రమంలో ఉప్పల్ కు చెందిన ఆదిత్య.. కావాసకి స్పోర్ట్స్ బైక్ తో వారిద్దరిని ఢీకొట్టాడు.
ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆపై హత్య వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
ఒక మనిషిని మరో మనిషి చంపడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఒక్క క్షణం ఆలోచించకుండా చంపేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు పడి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు తాను హత్య చేసిన ఉదంతాన్ని మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ హత్య ఘటనను చూసిన అక్కడున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు హత్య చేసిన నిందితుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు గెలుపు
టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరిగిన విషయం తెల్సిందే. సి. కళ్యాణ్ ప్యానెల్ తో దిల్ రాజు ప్యానెల్ పోటీపడి ఎట్టేకలకు విజయాన్ని అందుకుంది. సి. కళ్యాణ్ ప్యానెల్ ను ఓడించి దిల్ రాజు ప్యానెల్ గెలుపు జెండా ఎగురవేసింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్ గెలుపొందింది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపును అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కూడా దిల్‌రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు. దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
నా జీవితం తెరిచిన పుస్తకం.. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఏం చేయాలో మర్చిపోను
బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకమని, నాలాంటి వాడు ఎలాంటి పదవిలో ఉన్నా.. నిజమైన అర్హులకు లబ్దిచేకూర్చే పని చేస్తున్న. నేను మీ కుటుంబంలో సభ్యున్ని అని ఆయన అన్నారు. మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్న. అదే నాకు కొండంత అండ. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ మీ ప్రేమ అనంతం. వెల కట్టలేనిది. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఎం చేయాలో మర్చిపోనని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘ఇందిరా పార్క్ ప్రతి టెంటును పలకరించిన వడిని నేను. పంచాయితీ సెక్రటరీలు, గ్రామ పంచాయితీ సిబ్బంది,VRA, VRO, జీఓ నంబర్ 46 వల్ల ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్స్ ఒకటే రాష్ట్రంలో ఒకే కులంలో పుట్టిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో వ్యత్యాసం ఉంది. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు చేసే ఆర్తనాదాలు వినే సమయం లేదు. ప్రగతి ముట్టడి చేస్తే కొడుతున్నారు. మమ్ముల్ని కొట్టండి కానీ మా పొట్టమీద కొట్టవద్దు అని విద్యార్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ అవ్వక యువతకు పిల్లలు ఇచ్చే దిక్కులేదు.. పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మ అయ్యకు బువ్వ పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న డీఏ
రైతుల కోసం పిఎం కిసాన్ యోజన విడతను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేశారు. కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయింది. ఇదిలా ఉండగా కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగులకు కరువు భత్యంలో 4 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఏడో వేతన సంఘం కింద ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతుంది. డియర్‌నెస్ అలవెన్స్‌లో పెంపుదల మొదటిసారి జనవరిలో… మళ్లీ 6 నెలల తర్వాత జూలైలో ప్రకటిస్తారు. ఈ ఏడాది జులైలో పెంపుదల ఇంకా ప్రకటించలేదు, అయితే ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. JUI-F సమావేశం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సంఘటనా స్థలం నుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే..
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నడిచేది రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే అని అన్నారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని పేర్కొన్నారు. దయచేసి రాజకీయాలు మాట్లాడకుండా ఏం చేద్దామో చెప్పండని బీజేపీని ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదని వినోద్ కుమార్ తెలిపారు. నిన్న రేవంత్ రెడ్డి, ఈరోజు కిషన్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
చిరంజీవికి ఆ అదృష్టం లేదు.. ‘బేబీ’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను మోసం చేసే కథగా తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమాకు క్యూ కట్టారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాను ప్రశంసించాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా బేబీ చిత్రాన్ని ప్రశంసించాడు. ఇక తాజాగా ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. బేబీ మూవీ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ అనే పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ ప్రెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.