ప్రపంచంలో ఒకచోట ఎడతెరిపి లేని వర్షాలు.. మరొక చోట అగ్ని వర్షం కురుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తో లక్షలాది మంది ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. యూరప్, జపాన్‌లో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. క్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వర్ష బీభత్సంతో డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ…
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా మారింది దేశ రాజధాని ఢిల్లీలోని వరదల పరిస్థితి. యమునా నది ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ.. వర్షాలు తగ్గకపోవడంతో .. ఢిల్లీ ప్రజలు ఇంకా వరద నీటి నుంచి బయటికి రాలేకపోతున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. డీజిల్‌పై మొత్తం వ్యాట్ రికవరీ లీటరుకు రూ.10.40కి పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.
మంచు శివలింగం దర్శనం కోసం భక్తులు చేపట్టే అమర్‌నాథ్ యాత్ర పునః ప్రారంభమైంది. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే
దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. 41 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో వరద ముప్పు పొంచి ఉన్నట్టు సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
శ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని ప్రాంతాలు నీటితో నిండి ఉన్నాయి. మరోవైపు లోధి రోడ్డులోని పలువురు ఎంపీల ఇళ్లు కూడా జలమయమయ్యాయి. ఢిల్లీలోని లజ్‌పత్‌తో పాటు అన్ని ప్రధాన మార్కెట్లలో నీటి కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వర్షం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితిని VK సక్సేనా…
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.