Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి,…
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతోంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి.. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు..
Telangana Projects: నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి నీటి విడుదల చేసారు ప్రాజెక్టు అధికారులు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని విడుదల చేశారు అధికారులు.
Telangana Rains: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వాతావరణ మార్పులకు అనుగుణంగా రుతుపవనాలు మారుతున్నాయని 10 ఏళ్ల ఇండో-జర్మన్ అధ్యయనం ప్రకారం, ఈ సంవత్సరం రుతుపవనాల ప్రారంభం కూడా తెలంగాణలో ఆలస్యం అవుతుందని పేర్కొంది. రైతులు తమ పంటలను నాటడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడానికి సహాయపడే సూచనలపై కూడా అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రత్యేకమైన రుతుపవనాల ప్రారంభ సూచన, వ్యూహాత్మక ప్రణాళిక , విపత్తు ప్రతిస్పందన కోసం ప్రభుత్వం ఉపయోగించగల విలువైన అంతర్దృష్టులను అందించగలదని అది జతచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు (వ్యవసాయం) రమేష్…
Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.