Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే.
TS Heavy rains: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Telangana Rain: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
TS Rains: గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
Telangana Rain Updates: తెలంగాణలో వర్షాలు కురిసి దాదాపు 15 రోజులు కావస్తోంది. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలు ఎడతెరిపి లేకుండా మాయమయ్యాయి. రైతులకు ఆగస్టు నెల కీలకం.. వరుణుడు ముఖం చాటేశాడు.
Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని గత వారంలో వర్షాలు అతలా కుతలం చేశాయి. జూలై నెలాఖరున ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వానలు జిల్లాలు, గ్రామాల్లోని ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది.
తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతం తగ్గడం లేదు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.