Telangana Rains: నేడు, రేపు భారీవర్షాలు.. 11 జిల్లాలకు భారీ వర్షసూచన..
- తెలంగాణలో నేడు- రేపు భారీవర్షాలు..
- 11 జిల్లాలకు భారీ వర్షసూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాలం వచ్చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. వర్షాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు కొంత ఊరటనిస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read also: Yadagirigutta Temple: తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రస్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లాలో భీంపూర్ మండలం అర్లిలో 4.2, కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7, నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో 3.6, నిజామాబాద్ జిల్లా చిమన్‌పల్లిలో 3.5, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. . ఈరోజు తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Balkampet Yellamma: రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!