బెజవాడలో వరద తగ్గుముఖం పడుతోంది. బుడమేరు గండ్లు పూడ్చటంతో నగరంలో బుడమేరు వరద ఆగింది. బుడమేరు గండ్లు పూర్తిస్థాయిలో పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి. విజయవాడలోని కేఎల్ రావు నగర్, సాయిరాం సెంటర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచింది.
AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వర్షాలు, ముంచెత్తాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మొత్తమ్మీద ముంపు బారిన పడిన 294 గ్రామాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13, 227 మందిని ప్రభుత్వ పునరావాస శిబిరాలకు ప్రభుత్వం తరలించిందని పేర్కొన్నారు.
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు.
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవ�
ఏపీలో వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితుల వద్దకు రెస్క్యూ బృందాలు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.