రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు ఒకటి లేదా రేడు చోట్ల కురిసే ఛాన్స్ ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనున్నాయి.. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల…
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం…
భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది…
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
భారీ వర్షాలతో ఏపీ తడిసిముద్దయింది. ఇప్పటికే భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. కడపలో పర్యటించిన ద్వారక తిరుమలరావు బస్టాండ్, గ్యారేజ్‌ను పరిశీలించారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఈ రోజు సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. నిన్న రాజంపేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు…
బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో… ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆదివారం, సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కవ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఓ మోసర్తు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. దీనికి అల్పపీడనం తోడు…