వాతావరణ పరిస్థితులపై నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోందని, శ్రీహరికోట, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత మండల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు రెండురోజులు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఇక లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, 1077 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు సహాయం కోసం 1077 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించ వచ్చునని జిల్లా కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. సోమశిల రిజర్వాయర్ కు వరద కొనసాగుతోందని,పెరుగుతున్న ఇన్ ఫ్లో కారణంగా ఔట్ ఫ్లో కూడా పెంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి పోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అవసరమైతే వినియోగించుకొనేలా బోట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
Also Read
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
తాజావార్తలు
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!