తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి వాతారణం చల్లబడింది. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. చల్లని వాతావరణంలో భక్తులు సేదతీరారు. వరుసగా మూడో రోజు తిరుమలలో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో గత రెండ్రోజులుగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సైతం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికీ 12 గంటల తర్వాత…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది.