Tirumala Rain: తిరుమలలో వరుసగా మూడోరోజు కురుస్తున్న వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి వాతారణం చల్లబడింది. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. చల్లని వాతావరణంలో భక్తులు సేదతీరారు. వరుసగా మూడో రోజు తిరుమలలో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో గత రెండ్రోజులుగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సైతం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికీ 12 గంటల తర్వాత వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఆ తర్వాత సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. వర్షంతో తిరుమలలో చలి తీవ్రత పెరిగి.. ఈదురుగాలులకు కౌస్తుభం, డీటైప్ క్వార్టర్స్, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
READ MORE: Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, దక్షిణ నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!