Monsoon: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రానున్న 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
Read also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరం అంతా కిక్కిరిపోయింది.
Read also: Rohit Sharma Record: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
మరోవైపు అల్లూరిజిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవనాలు నేడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 3 నుంచి 4 రోజుల్లో తెలంగాణ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
JC Prabhakar Reddy: మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా.. జేసీ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!