Rain Alert: నేటి నుంచి తెలంగాణలో నాలుగు రోజులు వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేటి (గురువారం) నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడ తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
Read also: KCR Protest: నేడు బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన.. శ్రేణులకు కేసీఆర్ పిలుపు
Also Read
కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తుపాను ఏర్పడిందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Read also: Bollywood Hero : భార్య పేరున్న టాటూను తొలగించిన హీరో..విడాకులు తీసుకోబోతున్నారా?
ఈరోజు (గురువారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మహాబూబ్‌నగర్, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read also: AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!
ఇక శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వనపర్తి, వనపర్తి టి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19, 20 తేదీల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Arvind Kejriwal: నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!