దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
ఏపీ, తెలంగాణాలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది..రానున్న మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి..ఇక తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. Read Also:Vijay Sethupathi:ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు…
దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలు అతలాకుతలం అయ్యారు.. నిన్న పశ్చిమ బెంగాల్ లో ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు కూడా పడ్డాయి. పిడుగు పాటుకు ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ని మాల్దా జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు చిన్నారులతో పాటు ఏడుగురు మృతి చెందారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మాల్దాలోని బంగిటోలా హైస్కూల్ సమీపంలో పాఠశాల వేళల్లో…
ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇటీవల బిపర్ జాయ్ తీవ్ర తుఫాన్ వల్ల స్తంభించిన రుతుపవనాలు మళ్లీ విస్తరించడం మొదలుపెట్టాయి.. ఇక త్వరలోనే తెలంగాణా లో కూడా ప్రవేశినుంచనున్నాయి.. ఈ మేరకు నేడు, రేపు తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, కామా రెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు,…
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.